Header Banner

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

  Tue May 06, 2025 10:53        Politics

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే హామీ ఇచ్చిన విధంగా ఈ నెలలోనే రైతులకు అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులకు సమాయత్తం అవుతోంది. ఈ మేరకు మార్గ దర్శకాల పైన కసరత్తు జరుగుతోంది. దీంతో పాటుగా విద్యా సంవత్సరం ప్రారంభంలోగా తల్లికి వందనం అమలు పైన నిర్ణయం చేసారు. తాజాగా సీఎం చంద్రబాబు ఈ పథకం అమలు పైన స్పష్టత ఇచ్చారు. కాగా, ఇకే విడతలోనే అమలు చేస్తారా.. రెండు విడతలుగా చెల్లిస్తారా అనేది చర్చగా మారింది. ఇక.. దాదాపుగా ఈ పథకం అమలులో నిబంధనలు ఖరారైనట్లు తెలుస్తోంది.

అమలు పై కసరత్తు
ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా తల్లికి వందనం పైన కసరత్తు చేస్తోంది. బడ్జెట్ లో ఈ పథకం కోసం నిధులు కేటాయించారు. హామీ ఇచ్చి విధంగా ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ రూ 15 వేలు చొప్పున ఇస్తామని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. అదే సమయంలో ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు ఇప్పుడు లబ్దిదారుల ఎంపికలో కీలకం కానున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోగానే తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటి కే పలు మార్లు స్పష్టం చేసింది. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార భరోసా విడుదల సమయంలో తల్లికి వందనం పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ పథకం అమలు చేస్తామని మరో సారి స్పష్టం చేసారు. విద్యా సంవత్సరం ప్రారంభం లోగా ఇస్తామని చెబుతూనే... ఒక ఇన్ స్టాల్ మెంటా లేక ఎలా ఇవ్వాలనేది ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు.

చంద్రబాబు క్లారిటీ
దీంతో, ఒకే విడతలో రూ 15 వేలు చెల్లిస్తారా.. రెండు విడతలుగా రూ 7500 చొప్పున చెల్లించే ఆలోచన చేస్తున్నారా అనే చర్చ మొదలైంది. ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించిన లబ్దిదారుల సంఖ్య... కావాల్సిన నిధుల పైన ఒక అంచనాకు వచ్చారు. ఇదే నెలలో అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను విడుదల చేయాల్సి ఉండటంతో ఇనిస్టాల్ మెంట్ అంశం తెర పైకి వచ్చినట్లు కనిపిస్తోంది. కాగా, తాజాగా చంద్రబాబు కూటమి నేతలతో టెలి కాన్ఫిరెన్స్ లో తల్లికి వందనం పాఠశాలల ప్రారంభానికి ముందే అమలు చేస్తామని స్పష్టత ఇచ్చారు. 2025- 26 బడ్జెట్‌లో రూ. 9407 కోట్లు ఈ పథకానికి కేటాయింపులు చేసారు. 2024-25 విద్యా సంవత్స రంలో రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారు. అయితే ఇందులో ప్రాధమికం గా 69.16లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చిన్నట్లు సమాచారం.

నిబంధనలు
ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాల పైన అధ్యయనం కొనసాగుతోంది. పథకం అమల్లో భాగంగా విద్యార్ధులకు 75 శాతం హాజరు నిబంధన కొనసాగనుంది. గతంలో వైసీపీ ప్రభు త్వం నిర్దేశించిన మార్గదర్శకాల ను సమీక్షిస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లింపు దారులు.. తెల్ల రేషన్‌ కార్డు లేనివారిని, 300 యూనిట్ల విద్యుత్‌ వినియోగించేవారిని, కారు కలిగి ఉన్న వారిని, అర్బన్‌ ప్రాంతంలో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్నవారికి పథకం అందటం లేదు. ఇక, ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. విద్యుత్ వినియో గం, కారు ఉండటం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా.. లేక, కొనసాగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

ఇది కూడా చదవండిఆ నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!

 

జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

 

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #SaluteToMother #GovernmentScheme #EligibilityCriteria #NewDecision #SocialWelfare #MotherhoodSupport #SchemeUpdate